Mon Dec 23 2024 13:32:18 GMT+0000 (Coordinated Universal Time)
నగల దుకాణంలో వింత ఆకారాలు.. హడలిపోయిన యజమాని
యజమాని సీసీ ఫుటేజీని పరిశీలించగా.. తెల్లటి నీడ మాదిరిగా ఉన్న రెండు ఆకారాలు కదులుతూ కనిపించాయి. ఆ ఫుటేజీలో రెండు దెయ్యాలు చేతులు కదుపుతా మాట్లాడుకుంటున్నట్లుగా
నగల దుకాణంలో వింత ఆకారాలు ఆ యజమానిని హడలిపోయేలా చేశాయి. ఆంధ్రప్రదేశ్ లోని తూ.గో. జిల్లా రాజమండ్రిలో ఈ ఘటన వెలుగుచూసింది. రాజమండ్రి గుండువారివాధిలో ఉన్న ఓ నగల దుకాణంలో దెయ్యాలున్నాయన్న వార్త స్థానికంగా కలకలం రేపుతోంది. ఈనెల 25వ తేదీ అర్థరాత్రి సమయంలో నగల దుకాణంలో రెండు వింత ఆకారాలు నగల షాపులోకి వచ్చినట్లు సీసీ ఫుటేజీలో రికార్డైంది. ఆ దృశ్యాలను మొబైల్ యాప్ లో చూసిన షాపు యజమాని షాక్ కు గురయ్యాడు. ఆ నగల దుకాణం నుంచి వింత అరుపులు, కేకలు వినిపిస్తుండటంతో స్థానికులు కూడా భయాందోళనలకు గురవుతున్నారు.
నిజంగా దెయ్యాలేనా ?
యజమాని సీసీ ఫుటేజీని పరిశీలించగా.. తెల్లటి నీడ మాదిరిగా ఉన్న రెండు ఆకారాలు కదులుతూ కనిపించాయి. ఆ ఫుటేజీలో రెండు దెయ్యాలు చేతులు కదుపుతా మాట్లాడుకుంటున్నట్లుగా కనిపిస్తోందని చెప్తున్నారు. కానీ నిజంగానే అవి దెయ్యాలా? లేక ఎవరైనా ఇలాంటి చిలిపి పనులు చేసి ఉంటారా ? అన్నది మాత్రం ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ప్రస్తుతం ఈ దెయ్యాల సీసీ ఫుటేజీ విజువల్స్ నెట్టింట్లో వైరల్ గా మారాయి. గతంలో ఇలాంటి వీడియోలు చాలానే వైరల్ అయ్యాయి. ఢిల్లీలోని ఓ కోర్టులో కుర్చీలు వాటంతట అవే కదలడం, కంప్యూటర్లు ఆన్ అవ్వడం, తలుపులు ఆటోమెటిక్ గా తెరుచుకోవడం వంటి ఘటనలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. ఆ పనులన్నీ దెయ్యాలే చేశాయని గట్టి వాదన ఉన్నప్పటికీ.. ఇప్పటికీ దానిపై స్పష్టత రాలేదు.
Next Story