Fri Dec 20 2024 04:52:43 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో వచ్చేది ఏ ప్రభుత్వం.. నాదెండ్ల మనోహర్ తండ్రి చెప్పింది ఇదే?
నా కొడుకు నాదెండ్ల మనోహర్ బాగా చదువుకున్నాడని.. తెలివైన వాడని
‘జనసేన’ పార్టీలో రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తండ్రి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీదే విజయమని ఆయన అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ పరిస్థితులు చూస్తే ఆంధ్రలో మళ్లీ జగనే గెలుస్తారన్నారు. బాగా పనిచేశారని.. వెనుకబడిన వాళ్లంతా ఆయనతోనే ఉన్నారన్నారు. రెడ్డి, కమ్మ డివైడ్ అయ్యారు కానీ.. బ్రాహ్మణులు, వైశ్య మిగిలిన వాళ్లంతా జగన్‌తోనే ఉన్నారని.. వాళ్లు చంద్రబాబుని ఇష్టపడరన్నారు.
నా కొడుకు నాదెండ్ల మనోహర్ బాగా చదువుకున్నాడని.. తెలివైన వాడని చెప్పుకొచ్చారు. ఎంబీఏ పూర్తి చేసిన తరువాత హోటల్ బిజినెస్ చేశారని.. ఆ తరువాత రాజకీయాల్లోకి రావాలని భావించాడన్నారు. ఆ సినిమా యాక్టర్తోతో కలిసి తిరుగుతున్నాడు. నేనేం వెళ్లమనలేదని చెప్పారు. అంతకు ముందు నా కొడుకు అసెంబ్లీ స్పీకర్‌గా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఓసారి నేను ప్రై మినిస్టర్ ఆఫీస్‌కి పోతే.. మనోహర్ తండ్రి వచ్చారని అన్నారు. రాజకీయాల్లోకి వస్తానంటే వద్దు.. ఇదో పెద్ద బూతు, చెండాలం అని చెప్పానని తెలిపారు. నా భార్యకి కూడా రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేదు.. కానీ వాడు వినలేదు. ధైర్యంగా ముందుకు వచ్చాడన్నారు.
Next Story