Fri Dec 20 2024 01:37:40 GMT+0000 (Coordinated Universal Time)
పొత్తులపై త్వరలో ప్రకటన: నాదెండ్ల ప్రకటన
తమ పార్టీ పొత్తులపై త్వరలోనే స్పష్టత ఇస్తుందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు
2024 ఎన్నికలకు సంబంధించి తమ పార్టీ పొత్తులపై త్వరలోనే స్పష్టత ఇస్తుందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. పొత్తులపై తమ పార్టీ అధినేతకు స్పష్టత ఉందని ఆయన అన్నారు. జనవరి 12వ తేదీన శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో నిర్వహించే యువశక్తి పోస్టర్ ను ఆయన విడుదల చేసిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
బస్సు యాత్రపై కూడా...
అయితే ఎవరితో పొత్తులుంటాయి? అనే దానిపై పవన్ కల్యాణ్ చెబుతారని ఆయన అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా జనసేన అన్ని ప్రయత్నాలు చేస్తుందని నాదెండ్ల తెలిపారు. పవన్ కల్యాణ్ బస్సు యాత్రపై కూడా త్వరలోనే స్పష్టత ఇస్తామని, ముందుగా పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు.
Next Story