Fri Dec 20 2024 07:06:57 GMT+0000 (Coordinated Universal Time)
16న మండపేటకు పవన్ కల్యాణ్
ఈ నెల 16న మండపేటకు పవన్ కల్యాణ్ వస్తారని, ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శిస్తారని నాదెండ్ల మనోహర్ తెలిపారు.
ఈ నెల 16న మండపేటకు పవన్ కల్యాణ్ వస్తారని, ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శిస్తారని నాదెండ్ల మనోహర్ తెలిపారు. అనంతరం జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారని తెలిపారు. 16న పవన్ కల్యాణ్ సభకు రాకుండా పోలీసుల ఆంక్షలు ఇప్పటి నుంచే మొదలయ్యాయని నాదెండ్ల మనోహర్ తెలిపారు. కౌలు రైతులకు వైసీపీ ప్రభుత్వం సరైన న్యాయం చేయడం లేదని ఆయన ఆరోపించారు.
హేళనగా మాట్లాడుతూ...
కౌలు రైతుల ఆత్మహత్యలపై వైసీపీ నాయకులు హేళనగా మాట్లాడుతున్నారని నాదెండ్ల మనోహర్ అభ్యంతరం తెలిపారు. రైతుల కష్టాలపై ముఖ్యమంత్రి సక్రమంగా స్పందించడం లేదని ఆయన చెప్పారు. ప్రభుత్వమే ఎనిమిది వందల మంది కౌలు రైైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఒప్పుకుందని, వారికి ఏడు లక్షల రూపాయల చొప్పున ఇచ్చారా? అని నాదెండ్ల ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో మూడు వేల మంది చనిపోతే 800 మంది చనిపోయినట్లు తప్పుడు లెక్కలు చెబుతుందని ఆయన మండి పడ్డారు.
Next Story