Fri Dec 20 2024 07:29:40 GMT+0000 (Coordinated Universal Time)
అవన్నీ ఒట్టి రూమర్స్.. ఇప్పుడే ఆలోచన లేదు
మోదీ, పవన్ కల్యాణ్ భేటీపై జరుగుతున్న ప్రచారం అర్ధరహితమని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు
ప్రధాని నరేంద్ర మోదీ, పవన్ కల్యాణ్ భేటీపై జరుగుతున్న ప్రచారం అర్ధరహితమని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు, ఎన్నికల సమయంలో జరగాల్సిన చర్చను ఇప్పుడు తేవడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. పెడన పోలీస్ స్టేషన్ ఆవరణలో జనసేన కార్యకర్తలపై జరిగిన దాడి అమానుషమని అన్నారు. ప్రభుత్వం చేసే దాడులకు జనసైనికులు భయపడబోరని ఆయన అన్నారు.
ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే...
ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయిందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. నాలుగు గ్రామాల ప్రజలు నష్టపోయినా ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. ఇళ్లు కోల్పోయిన వారికి మూడు నెలల్లో ఇళ్లు కట్టించి ఇస్తామన్న జగన్ హామీ ఇప్పటి వరకూ నెరవేరలేదన్నారు. ఎకరాకు 12,500 రూపాయల నష్టపరిహారం ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఇంత వరకూ నెరవేర్చలేదని నాదెండ్ల మండి పడ్డారు. అన్నమయ్య ప్రాజెక్టు నిర్వాసితులపై పవన్ కల్యాణ్ కు తాము నివేదిక ఇస్తామని ఆయన వెల్లడించారు.
Next Story