Mon Nov 18 2024 00:25:48 GMT+0000 (Coordinated Universal Time)
Nagababu: ఆ పార్టీపై సంచలన ఆరోపణలు చేసిన నాగబాబు
కూటమి ప్రభుత్వపు తాలుకు పరిపాలన సజావుగా జరగకుండా ఉండటానికి
జనసేన నేత నాగబాబు ఏపీలో శాంతి భద్రతలకు సంబంధించి సంచలన ఆరోపణలు చేశారు. ఓ పార్టీ గొడవలు సృష్టించడానికి ప్రయత్నిస్తూ ఉందంటూ ట్వీట్ చేశారు. జిల్లాకి 10 కోట్ల చొప్పున రాబోయే రెండేళ్ల కాలనికి ఖర్చు పెట్టడానికి ఒక పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అల్లర్లు చేసేస్తే మధ్యంతర పరిపాలన వచ్చేస్తుందని అనుకునే పనికిమాలిన ఆలోచనలు మానుకోవాలని హితవు పలికారు.
"కూటమి ప్రభుత్వపు తాలుకు పరిపాలన సజావుగా జరగకుండా ఉండటానికి రాష్ట్రంలో అల్లర్లు,గొడవలు హింసాత్మక సంఘటనలు చేయటానికి ప్రతి జిల్లాకి 10 కోట్ల చొప్పున రాబోయే రెండేళ్ల కాలనికి ఖర్చు పెట్టడానికి ఒక పార్టీ ప్రయత్నిస్తోంది,
అది ఏ పార్టీ అని మీకు చెప్పనక్కర్లేదు,
మాకొచ్చిన సమాచారం ఇది..
మీరు జిల్లాకి పదికోట్ల చొప్పొన 13 ఉమ్మడి జిల్లాలకి 130 కోట్లు అదే సంవత్సరానికి 1500 కోట్లు ఖర్చు పెట్టేబదులు ఆ డబ్బు సామన్యుల సంక్షేమానికి మీరు చేసిన పాపాలు కడుక్కోటానికి ఖర్చు పెట్టుంటే కొంతలో కొంతైన మీమీద సింపతీ వచ్చేది కాని
ఇలా అల్లర్లు చేసేస్తే తద్వార మధ్యంతర పరిపాలన వచ్చేస్తది అనుకునే పనికిమాలిన ఆలోచనలు మానుకోండి, మీ క్రూర వ్వవహారాలేవి మాదాక రావు అనుకోకండి,
వీటిని ధీటుగా ఎదుర్కుంటాం కాకపోతే మీకు నేనిచ్చే ఒక మంచి సలహా ఏంటంటే ఆ హింసాత్మక చర్యలకి పెట్టే ఆ డబ్బుని పేదల కోసం పెడితే వారి పురోగతి కోసం పెడితే కనీసం ఈసారి ప్రతిపక్ష హోదా అయిన దక్కుద్ది,
ఇదే నా సలహా పాటిస్తే మంచిది పాటించకపోతే కూటమి ప్రభుత్వానికి మీ కుట్రలని ఎలా అరికట్టాలో బాగా తెలుసు..!" అంటూ నాగబాబు ట్వీట్ చేశారు.
Next Story