Sun Nov 17 2024 21:32:43 GMT+0000 (Coordinated Universal Time)
Nagarjun Sagar : సాగర్ జలకళను చూసి వద్దామా?
నాగార్జున సాగర్ కు జలకళ సంతరించుకుంది. భారీ వర్షాల కారణంగా వరదనీరు సాగర్ జలాశయానికి పోటెత్తుతుంది
నాగార్జున సాగర్ కు జలకళ సంతరించుకుంది. భారీ వర్షాల కారణంగా వరదనీరు సాగర్ జలాశయానికి పోటెత్తుతుంది. దీంతో నాగార్జున సాగర్ లోని 26 గేట్లను ఇరిగేషన్ శాఖ అధికారులు ఎత్తి కిందకు నీటిని విడుదల చేస్తున్నారు. 22 గేట్లను ఐదు అడుగులు, నాలుగు గేట్లను పది అడుగుల మేర ఎత్తారు.
26 గేట్లు ఎత్తి...
ప్రస్తుతం నాగార్జున సాగర్ ప్రాజెక్టకు 2.53 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతుండగా, 2.69 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రస్తుత నీటి మట్టం 585.30 అడుగులు ఉండగా, పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.50 టీఎంసీలుగా ఉంది. ప్రస్తుతం నాగార్జున సాగర్ నీటి నిల్వ 298.30 టీఎంసీలుగా ఉందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు.
Next Story