Mon Dec 23 2024 12:42:52 GMT+0000 (Coordinated Universal Time)
సాగర్ ప్రాజెక్టుకు వరద నీరు
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు మరోసారి వరద ఉదృతి చేరుతుంది. ప్రాజెక్ట్ నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు.
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు మరోసారి వరద ఉదృతి చేరుతుంది. ప్రాజెక్ట్ నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. నాలుగు గేట్లు ఐదు అడుగుల మేర పైకి ఎత్తి 32,360 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో 76,656 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో కూడా 76,656 క్యూసెక్కులుగా నమోదయింది.
క్రమంగా పెరుగుతూ...
నాగార్జున సాగర్ ప్రస్తుతం పూర్తి స్థాయి నీటి మట్టం 590.అడుగులుగా ఉంది.ప్రస్తుత నీటి మట్టం589.90 అడుగులు గా నమోదయింని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి నిల్వ 312 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ : 311.7462 టీఎంసీలుగా నమోదయిందని అధికారులు చెప్పారు.
Next Story