Tue Dec 24 2024 14:10:40 GMT+0000 (Coordinated Universal Time)
తప్పు చేసిన వారిని వదలబోం : నల్లారి
వైసీపీ ప్రభుత్వ అక్రమాలపై విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తసుకుంటామని నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తెలిపారు
వైసీపీ ప్రభుత్వ అక్రమాలపై విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తసుకుంటామని ఎమ్మెల్లే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తెలిపారు. పరిశ్రమల కోసం రైతుల దగ్గర సేకరించిన భూమిని ఆక్రమించిన వాటిని తిరిగి స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. పీలేరు నియోజకవర్గ పరిధిలో వైసీపీ నాయకులు చేసిన అక్రమాలను సహకరించిన అధికారుల్ని వదిలి పెట్టబోనని ఆయన తెలిపారు. గత వైసిపి ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై ఉక్కుపాదం మోపుతామని , మాజీ మంత్రి పెద్దిరెడ్డి రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి,మాజీ ఎమ్మెల్లే చింతల రామచంద్రా రెడ్డి,వారి అనుచరులు చేసిన భూ ఆక్రమణలు,అక్రమ ఇసుక,మట్టి, తరలింపు, అక్రమ రిజిస్ట్రేషన్ లు,సహజ వనరుల్ని దోచుకొన్న వారు, వారికి సహకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకొంటామని తెలిపారు.
ఎవరు తప్పు చేసినా...
పీలేరు శివారుల్లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నియోజకవర్గ పరిధిలో నిరుద్యోగులు, కార్మికులు,యువత, ఉపాధి కోసం వందల ఎకరాల భూమి పరిశ్రమలు నిర్మించడానికి రైతుల దగ్గర భూములు సేకరించారని, 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పీలేరు పరిధిలో ఉన్న ప్రభుత్వ భూముల్ని ఎవడబ్బ సొత్తు అని దొరికిన కాడికి దోచుకొంటున్నారని దుయ్యబట్టారు. సంబంధిత అధికారులతో విచారణ జరిపిస్తామని తెలిపారు. ఈ నెల12న చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం తర్వాత పీలేరు నియోజకవర్గ పరిధిలో జరిగిన అక్రమాల్ని వెలికితీసి అందరిపై చర్యలు తీసుకొంటామని మీడియా కు వివరించారు. ఎవరినీ వదిలపెట్టబోమని ఆయన హెచ్చరించారు. తప్పు చేసిన వారిని వదలబోమని అన్నారు.
Next Story