Sat Mar 15 2025 12:12:15 GMT+0000 (Coordinated Universal Time)
ఇలాంటి నాయకులను కోల్పోవడం మన దురదృష్టం : బాలకృష్ణ
ఆంధ్రప్రదేశ్ ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించిన గౌతమ్ రెడ్డి ..

ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సోమవారం ఉదయం.. ఆకస్మిక మరణం చెందారు. ఆయన మృతి పట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రతిపక్ష పార్టీల నేతలు సంతాపం ప్రకటిస్తున్నారు. టీడీపీ నేత, నటుడు నందమూరి బాలకృష్ణ మేకపాటి మృతి పట్ల దిగ్భ్రాంతి చెందారు. ఆయన లేని లోటును ఎవరూ తీర్చలేరన్నారు. మేకపాటి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Also Read : భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ వాయిదా
" ఆంధ్రప్రదేశ్ ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించిన గౌతమ్ రెడ్డి రాజకీయాల్లో ప్రవేశించి, పార్టీలకు అతీతంగా అందరితో కలుపుగోలుగా ఉంటూ మంచి యువనాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇలాంటి నవతరం నాయకుల్ని చిన్నవయస్సులోనే కోల్పోవడం దురదృష్టకరం. గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను" అని బాలకృష్ణ ఓ ప్రకటన పేర్కొన్నారు.
Next Story