Mon Dec 23 2024 08:35:01 GMT+0000 (Coordinated Universal Time)
ప్రభుత్వ స్పందన బట్టే కార్యాచరణ.. బాలయ్య వార్నింగ్
హిందూపురం ను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని నందమూరి బాలకృష్ణ కోరారు
హిందూపురం ను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని నందమూరి బాలకృష్ణ కోరారు. సత్యసాయి జిల్లాగా పేరు ఉన్నప్పటికీ జిల్లా కేంద్రం మాత్రం హిందూపురంను ఉంచాలన్నారు. అనంతపురం కలెక్టర్ కు అఖిలపక్షంతో కలసి వినతిపత్రాన్ని సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. హిందూపురంలో అన్ని వసతులు ఉన్నాయన్నారు. ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని బాలకృష్ణ కోరారు.
ప్రకటించేంత వరకూ...
హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించేంత వరకూ ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పారు. కేవలం టీడీపీ మాత్రమే కాకుండా హిందూపురంలోని అన్ని పార్టీలను కలుపుకుని పోరాటాన్ని చేస్తామని బాలయ్య తెలిపారు. తెలుగుదేశం పార్టీ ప్రవేశ పెట్టిన పథకాలను అన్నింటినీ రద్దు చేశారన్నారు. పిచ్చి చేష్టలతో పాలన చేస్తున్నారని బాయ్య ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారన్నారు. ఎంత త్వరగా ఈ ప్రభుత్వం కూలిపోతుందన్న భావన ప్రజల్లో ఉందన్నారు. హిందూపురంపై ప్రభుత్వ స్పందన బట్టి తమ కార్యాచరణ ఉంటుందన్నారు.
Next Story