Fri Dec 20 2024 18:14:08 GMT+0000 (Coordinated Universal Time)
ఏఎన్నార్ పై వ్యాఖ్యలపై బాలయ్య రెస్పాన్స్
ఏఎన్నార్ పై చేసిన వ్యాఖ్యలకు వచ్చిన విమర్శలపై నందమూరి బాలకృష్ణ రెస్పాండ్ అయ్యారు
ఏఎన్నార్ పై చేసిన వ్యాఖ్యలకు వచ్చిన విమర్శలపై నందమూరి బాలకృష్ణ రెస్పాండ్ అయ్యారు. తనకు అక్కినేని నాగేశ్వరరావు బాబాయి లాంటి వాడినని, తాను కూడా బాబాయి అనే పిలిచే వాడినని తెలిపారు. పొగడ్తలకు లొంగిపోకూడదని నాగేశ్వరరావు బాబాయి నుంచే నేర్చుకున్నానని బాలకృష్ణ అన్నారు. ఏదో ఫ్లో లో అన్నమాటను పట్టుకుని రాద్ధాంతం చేయడ తగదని బాలకృష్ణ సూచించారు. అభిమానంతో తాను అన్న మాటలను వ్యతిరేకంగా ప్రచారం చేస్తే తనకు సంబంధం లేదన్నారు.
వాళ్ల పిల్లల కంటే...
అక్కినేని వాళ్ల పిల్లల కంటే తననే ఎక్కువగా ప్రేమించేవారని అన్నారు. ఆయనపై గుండెల్లో ప్రేమ ఉంటుందన్నారు. ఎందుకంటే అక్కడ ఆప్యాయత లేదని, ఇక్కడ ఉంది కాబట్టి అని అన్నారు. నాన్నగారిని ఎన్టీవోడు అని అనడం లేదా? తాను ప్రచారానికి వెళ్లినప్పుడు కూడా ఏదో ఒకటి అంటుంటారని, అక్కడ భాష, యాసను బట్టి అంటుంటారని బాలయ్య రెస్పాండ్ అయ్యారు. తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్టీఆర్, ఏఎన్నార్ రెండు కళ్లులాంటి వారని బాలయ్య అన్నారు. తాడో పేడో అంటారు పేడో కి అర్థమేంటి అని బాలకృష్ణ ఎదురు ప్రశ్నించారు.
Next Story