Sun Dec 14 2025 23:25:25 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీ నేతలకు ఇవే చివరి ఎన్నికలు: బాలకృష్ణ
వైసీపీ నేతలకు ఇవే ఆఖరి ఎన్నికలు అని సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి

వైసీపీ నేతలకు ఇవే ఆఖరి ఎన్నికలు అని సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. కేసులకు, కోర్టులకు భయపడేది వైసీపీ నేతలేనని తాము కాదని అన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టు అయిన బాధలో పలువురు చనిపోవడం బాధాకరమని అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన ‘వారాహి’ యాత్రకు పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నట్లు నందమూరి బాలకృష్ణ తెలిపారు. కేసులకు తాము భయపడేది లేదని అన్నారు.
చంద్రబాబును అరెస్టు చేసిన నంద్యాలలోని ఆర్కే ఫంక్షన్ హాల్లో ఆ పార్టీ పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ భేటీ అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ.. తప్పు చేయనప్పుడు దేవుడికి కూడా భయపడాల్సిన అవసరం లేదన్నారు. సీఎం జగన్ ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేశారని.. ఏ ఆధారాలు లేకుండా చంద్రబాబును అరెస్టు చేశారన్నారు. ఆయనపై స్కిల్ కేసును రాజకీయ కక్షతోనే పెట్టారని నందమూరి బాలకృష్ణ ఆరోపించారు.
Next Story

