Mon Dec 23 2024 07:30:29 GMT+0000 (Coordinated Universal Time)
నందమూరి కుటుంబం రెస్పాన్స్
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పేరు మార్చడంపై నందమూరి కుటుంబం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పేరు మార్చడంపై నందమూరి కుటుంబం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పేరు మార్పుపై అభ్యంతరం వ్యక్తం చేసింది. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరింది. నిన్న వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై నందమూరి కుటుంబ సభ్యులు స్పందించారు. నందమూరి రామకృష్ణ పేరుతో ఒక ప్రకటన విడుదల చేశారు.
దురదృష్టకరం...
విజయవాడలోని హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించడాన్ని నందమూరి కుటుంబ సభ్యులు ఖండించారు. హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని వారు ప్రశ్నించారు. ఇది దురదృష్టకరమని వారు అన్నారు. ఎన్టీఆర్ కులాలు, ప్రాంతాలు, మతాలకు అతీతమైన మహానేత అని ఆ కుటుంబం తెలిపింది. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడిన ఎన్టీఆర్ ను అవమానించ వద్దని ఆ ప్రకటనలో నందమూరి కుటుంబం కోరింది.
Next Story