Fri Nov 22 2024 13:03:01 GMT+0000 (Coordinated Universal Time)
వర్సిటీ పేరు మార్పుపై కల్యాణ్ రామ్ ట్వీట్
ఈ విషయంపై నందమూరి కుటుంబం, జూనియర్ ఎన్టీఆర్ స్పందించి తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. తాజాగా కల్యాణ్ రామ్ వర్సిటీ పేరు..
నిన్న జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశంలో సీఎం వైఎస్ జగన్.. విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మారుస్తున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ పేరును తొలగించి వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా నామకరణం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు బిల్లును ప్రవేశపెట్టి.. దానిని ఆమోదించేశారు కూడా. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రతిపక్షాల నుంచి సాధారణ ఓటర్లు వరకు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ విషయంపై నందమూరి కుటుంబం, జూనియర్ ఎన్టీఆర్ స్పందించి తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. తాజాగా కల్యాణ్ రామ్ వర్సిటీ పేరు మార్పుపై ట్వీట్ చేశారు. "1986లో విజయవాడలో మెడికల్ యూనివర్శిటీ స్థాపించబడింది. ఆంధ్రప్రదేశ్ లోని 3 ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన వైద్య, విద్యను అందుబాటులోకి తీసుకురావాలని కోరుకున్న శ్రీ ఎన్టీఆర్ గారు.. ఈ మహావిద్యాలయనికి అంకురార్పణ చేశారు. ఈ విశ్వవిద్యాలయం దేశంలోనే అత్యుత్తమంగా అభివృద్ధి చెందడమే కాకుండా, నైపుణ్యం కలిగిన ఎంతోమంది వైద్య నిపుణులను కూడా దేశానికి అందించింది."
"తెలుగు రాష్ట్రాలలో వైద్య అధ్యయనాల మెరుగుదలకు ఎన్టీఆర్ గారు చేసిన కృషిని స్మరించుకునేందుకు విశ్వవిద్యాలయానికి.. "డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్" అని పేరు మార్చబడింది. 25 ఏళ్లలో ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ విశ్వవిద్యాలయం పేరును మార్చడం జరగలేదు. నాకు ఇది ఎంతో బాధను కలిగించింది. కేవలం రాజకీయ లబ్ది కోసం చాలా మంది భావోద్వేగాలతో ముడిపడివున్న ఈ అంశాన్ని వాడుకోవటం తప్పు" అంటూ కల్యాణ్ రామ్ ట్వీట్ చేశారు.
Next Story