Mon Dec 23 2024 11:44:51 GMT+0000 (Coordinated Universal Time)
ఆసుపత్రికి హుటాహుటిన చేరుకున్న బాలకృష్ణ
నందమూరి తారకరత్న స్పృహతప్పి పడిపోవడంతో వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
నందమూరి తారకరత్న స్పృహతప్పి పడిపోవడంతో వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఎండ తీవ్రతకు సొమ్మ సిల్లిపోయాడని అందరూ అనుకున్నారు. కానీ గుండె పోటు రావడంతోనే ఆయన స్పృహతప్పి పడిపోయినట్లు వైద్యులు చెబుతున్నారు. కుప్పం కేసీ ఆసుపత్రికి తొలుత తరలించారు. అక్కడ ప్రాధమిక చికిత్స చేసిన అనంతరం కుప్పం వైద్య కళాశాలకు తారకరత్నను తరలించారు. హార్ట్ బీట్ పడి పోవడంతో వెంటనే సీపీఆర్ వైద్యులు చేశారు. కార్డియాలజిస్టు అందుబాటులో లేకపోవడంతో వెంటనే ట్రీట్ మెంట్ ప్రారంభించామని వైద్యులు చెబుతున్నారు.
ఉదయంనుంచి...
లోకేష్ పాదయాత్రలో పాల్గొనేందుకు తారకరత్న కుప్పం ఆర్బి అండ్ బి గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు. 11.03 గంటలకు పాదయాత్ర ప్రారంభమయిన కొద్దిసేపటికే అంటే 11.15 గంటలకు స్పృహతప్పి పడిపోయారు. నందమూరి బాలకృష్ణ వెంటనే ఆసుపత్రికి చేరుకుని ఆయనకు అందుతున్న వైద్య పరీక్షల గురించి తెలిశారు. ప్రస్తుతం ఐసీయూలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఇటీవలే లోకేష్ ను కలసి ఏపీ రాజకీయాల గురించి చర్చించారు. కోలుకున్న తర్వాత తారకరత్నను మెరుగైన చికిత్స కోసం తారకరత్నను బెంగళూరుకు తరలించే అవకాశముంది.
Next Story