Mon Dec 23 2024 04:28:23 GMT+0000 (Coordinated Universal Time)
TDP : బైరెడ్డి శబరికి చంద్రబాబు కీలక బాధ్యతలు
టీడీపీ పార్లమెంటు డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు
తెలుగుదేశం పార్లమెంటు డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా నంద్యాల పార్లమెంటు సభ్యులు బైరెడ్డి శబరిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. తొలిసారి నంద్యాల బరిలో పోటీ చేసి బైరెడ్డి శబరి పార్లమెంటు సభ్యురాలిగా ఎన్నికయ్యారు. పార్లమెంటరీ పార్టీ టీడీపీ ఫ్లోర్ లీడర్ గా ఇప్పటికే లావు శ్రీకృష్ణదేవరాయలును నియమించిన చంద్రబాబు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి మహిళకు కేటాయించారు. బైరెడ్డి శబరి మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కుమార్తె. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానంద రెడ్డిపై బైరెడ్డి శబరి విజయం సాధించారు.
హరీశ్ మాధుర్ ను...
దీంతో పాటు లోక్‌సభలో తెలుగుదేశం పార్టీ విప్‌గా అమలాపురం పార్లమెటు సభ్యులు గంటి హరీశ్‌మాధుర్‌ను నియమిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాలు జారీచేశారు. హరీశ్ మాధుర్ దివంగత బాలయోగి తనయుడు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన 3.42 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. గతంలో బాలయోగిని లోక్‌సభ స్పీకర్‌గా చేసిన చంద్రబాబు.. ఇప్పుడాయన కుమారుడికి విప్ బాధ్యతలు అప్పగించారు.
Next Story