Thu Nov 14 2024 22:05:32 GMT+0000 (Coordinated Universal Time)
2 శాతం వాటా అమ్మినా 400 కోట్లు వస్తాయి: నారా భువనేశ్వరి
ప్రజల సొమ్ములను తీసుకోవాల్సిన అవసరం తమ కుటుంబానికి లేదని
ప్రజల సొమ్ములను తీసుకోవాల్సిన అవసరం తమ కుటుంబానికి లేదని టీడీపీ అధినేత చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి అన్నారు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు చిన్న తప్పు కూడా చేయలేదని.. చంద్రబాబు ఎప్పుడూ ప్రజల సంక్షేమం కోసమే ఆలోచిస్తారని నారా భువనేశ్వరి అన్నారు. తానే సొంతంగా ఒక సంస్థను నడుపుతున్నానని, ఆ సంస్థలో 2 శాతం వాటా అమ్మినా తమకు రూ. 400 కోట్లు వస్తాయని.. ఇక ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా వందల కోట్లు ఖర్చు చేస్తున్నామని అన్నారు. తనతో పాటు ప్రజలను కూడా ముందుకు తీసుకెళ్లడమే చంద్రబాబు నాయుడు లక్ష్యమని అన్నారు. ఏం తప్పు చేశారని ఆయనను జైల్లో పెట్టారని ప్రశ్నించారు నారా భువనేశ్వరి. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి ఐటీ ఉద్యోగులు వస్తుంటే ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. ఏపీకి రావాలంటే పాస్ పోర్ట్, వీసా కావాలా? అని మండిపడ్డారు.
నారా భువనేశ్వరి తన కోడలు బ్రాహ్మణితో కలిసి అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు.కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్కు నిరసనగా టీడీపీ నేతలు చేపట్టిన దీక్షా శిబిరానికి ఆమె వెళ్లారు. టీడీపీ నేతలు చేపట్టిన దీక్షకు సంఘీభావం ప్రకటించారు. మా కుటుంబమంతా ఎన్టీఆర్ అడుగుజాడల్లో నడుస్తున్నాం. ప్రజల కోసం మా కుటుంబం ఎప్పుడూ ఉంటుంది. మాకు ఎలాంటి కోరికలు లేవన్నారు. ఉన్నంతలో తృప్తి పడతామన్నారు. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు ఎలాంటి తప్పు చేయలేదని అయినా 17 రోజులు నిర్బంధించారని భువనేశ్వరి అన్నారు.
Next Story