Tue Nov 05 2024 16:37:47 GMT+0000 (Coordinated Universal Time)
తొలిసారి ఆ భేటీ నిర్వహించిన నారా భువనేశ్వరి
రాజమండ్రి లో తెలుగుదేశం పార్టీ ముఖ్యనేతలతో సమావేశం అయ్యారు
రాజమండ్రి లో తెలుగుదేశం పార్టీ ముఖ్యనేతలతో సమావేశం అయ్యారు నారా భువనేశ్వరి. చంద్రబాబు బెయిల్ కు ఇంకొంచెం సమయం పట్టే అవకాశం ఉండడంతో భవిష్యత్తు కార్యచరణపై ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు భువనేశ్వరి. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ కావడం, రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న నేపథ్యంలో మిగతా కుటుంబసభ్యులు కూడా రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్నారు. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి తొలి సారి పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబును కలిసిన భువనేశ్వరి ఆ వెంటనే పార్టీ కేడర్ కు భరోసా ఇచ్చారు. ఇప్పుడు తనయుడు లోకేశ్ తో కలిసి తాజా పరిస్థితులపైన సమీక్షించారు.
ఇప్పటివరకు రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె.. చంద్రబాబు అరెస్ట్‌తో క్రియాశీలకంగా మారారు. టీడీపీ నేతలు, కార్యకర్తలకు ధైర్యం కల్పిస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నారు. రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్న భువనేశ్వరి, టీడీపీ నేతలతో భేటీ కావడం ఇదే తొలిసారి. ఈ సమావేశంలో తాజా పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. మంగళవారం జైల్లో చంద్రబాబును భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి కలిశారు. ఈ సందర్భంగా పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై కుటుంబసభ్యులకు బాబు కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ముఖ్యనేతలతో లోకేష్, భువనేశ్వరి భేటీ నిర్వహించారు.
Next Story