Mon Dec 23 2024 05:35:14 GMT+0000 (Coordinated Universal Time)
బెదిరింపులకు భయపడం : భువనేశ్వరి
సీఐడీ బెదిరింపులకు తాము భయపడేది లేదని నారా భువనేశ్వరి అన్నారు. తిరుపతిలో జరిగిన సభలో ఆమె మాట్లాడారు
సీఐడీ బెదిరింపులకు తాము భయపడేది లేదని నారా భువనేశ్వరి అన్నారు. తిరుపతిలో జరిగిన సభలో ఆమె మాట్లాడారు. తమపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని ఆమె సిఐడీ అధికారులకు సవాల్ విసిరారు. ఎలాంటి విచారణైనా చేసుకోవచ్చన్నారు. తాాము టీడీపీ కార్యకర్తల డబ్బులతో బతకాల్సిన అవసరం లేదని ఆమె తెలిపారు.
కార్యకర్తలు...
క్రమశిక్షణగా ఉండటం, కార్యకర్తలకు క్రమశిక్షణను నేర్పించడం చంద్రబాబుకు తెలుసునన్న నారా భువనేశ్వరి, జైలుకు ములాఖత్ కకు వెళ్లినప్పుడు చంద్రబాబు ఎంతో ధైర్యంతో కనిపించారన్నారు. టీడీపీ కార్యకర్తలు ఎలా ఉన్నారని ఆయన అడుగుతున్నారని తెిపారు. లోకేష్ యువగళం పాదయాత్ర తిరిగి ప్రారంభమవుతుందన్న ఆమె ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయించారని అన్నారు. మీ ఓటను ఆలోచించి వేయాలని నారా భువనేశ్వరి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Next Story