Wed Apr 02 2025 11:00:30 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : భువనేశ్వరి నిరాహార దీక్ష.. ఎప్పుడంటే?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా నారా భువనేశ్వరి అక్బోబరు 2వ తేదీన నిరాహార దీక్ష చేయనున్నారు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా నారా భువనేశ్వరి అక్బోబరు 2వ తేదీన నిరాహార దీక్ష చేయనున్నారు. ఈమేరకు పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు. అదే రోజు రాత్రి రాష్ట్రంలో రాత్రి ఏడు గంటల నుంచి 7.05 గంటల వరకూ లైట్లు ఆపి చంద్రబాబుకు సంఘీభావం తెలపాలని, అరెస్ట్ కు వ్యతిరేకంగా నిరసన తెలియజేయాలని టీడీపీ నిర్ణయించినట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. లైట్లు ఆపి వరండాల్లోకి వచ్చి కొవ్వొత్తులతో నిరసన తెలియజేయాలని కోరారు.
సమన్వయ కమిటీ...
జనసేన, టీడీపీ సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకుని కార్యాచరణ రూపొందించుకుని ముందుకు వెళతామని అచ్చెన్నాయుడు తెలిపారు.చంద్రబాబు అరెస్ట్ తో మరణించిన 97 కుటుంబాలను పరామర్శిస్తామని అచ్చెన్నాయుడు తెలిపారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు తమ పార్టీ కూడా మద్దతు పలుకుతుందని తెలిపారు. త్వరలో కార్యాచారణను రూపొందించుకుని ప్రజల్లోకి వెళ్లేందుకు పార్టీని సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
Next Story