Sun Dec 22 2024 18:42:25 GMT+0000 (Coordinated Universal Time)
భువనేశ్వరి గారూ బాబు గారితో జాగ్రత్త
నారా భువనేశ్వరి చేసిన కామెంట్స్ కు వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా స్పందించారు. భువనేశ్వరి అన్న మాటల్లో నిజముందన్నారు.
నారా భువనేశ్వరి చేసిన కామెంట్స్ కు వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా స్పందించారు. భువనేశ్వరి అన్న మాటల్లో నిజముందన్నారు. మహిళలను ఏడిపించిన వారు వారి పాపాన వారే పోతారన్నదానికి ఉదాహరణ చంద్రబాబు అని రోజా అన్నారు. చంద్రబాబు హయాంలో అనేక మంది మహిళలు కాల్ మనీ కేసులో చిక్కుకుని వ్యభిచారం చేయాల్సి వచ్చిందన్నారు. తనను కూడా అసెంబ్లీలో ఏడిపించారన్నారు.
ప్రమాదం మీకే...
చంద్రబాబుతో ప్రమాదం మీకే పొంచి ఉందని రోజా భువనేశ్వరికి సూచించారు. చంద్రబాబు దొంగ ఏడుపులు ఎవరూ నమ్మరని అన్నారు. తన రాజకీయ లబ్ది కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి చంద్రబాబు అని, చివరకు భార్యను కూడా రాజకీయ లబ్ది కోసం ఉపయోగించుకుంటున్నారని రోజా ఫైర్ అయ్యారు. ఎన్టీఆర్ కుమార్తెగా తమకు భువనేశ్వరి పట్ల గౌరవం ఉందని, అనని మాటలు అన్నారని చెబుతూ ఆ గౌరవాన్ని తగ్గించుకోవద్దని రోజా సూచించారు.
Next Story