Mon Dec 23 2024 08:37:48 GMT+0000 (Coordinated Universal Time)
కొవ్వొత్తుల ర్యాలీ తర్వాత నారా బ్రాహ్మణి కీలక వ్యాఖ్యలు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుకు వ్యతిరేకంగా రాజమండ్రిలో
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుకు వ్యతిరేకంగా రాజమండ్రిలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి, కోడలు నారా బ్రాహ్మణి పాల్గొన్నారు.
చంద్రబాబుకు మద్దతు తెలుపుతున్న ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు నారా బ్రాహ్మణి. న్యాయవ్యవస్థపై తమకు విశ్వాసం ఉందని.. ఆయన నిర్దోషిగా బయటకు వస్తారనే నమ్మకం ఉందని బ్రాహ్మణి తెలిపారు. మా కుటుంబానికి ఇలాంటి పరిస్థితి వస్తుందని మేం ఎప్పుడూ ఊహించలేదని అన్నారు. చంద్రబాబు నాయుడు తెలుగు రాష్ట్రాలను ఎంతో అభివృద్ధి చేశారు. 42 ఏళ్ల రాజకీయ అనుభవమున్న నేతను జైల్లో పెట్టారన్నారు. చంద్రబాబు నాయుడు లక్షలాదిమంది యువతకు నైపుణ్యం మెరుగు పర్చేలా కృషి చేశారు. అభివృద్ధి, సంక్షేమం చేయడం నేరమా? ఉద్యోగాలు కల్పించడం నేరమా? అని ప్రశ్నించారు. ఇప్పుడున్న ప్రభుత్వం గంజాయి, లిక్కర్ ఇచ్చి యువత జీవితాలనునాశనం చేస్తోందన్నారు బ్రాహ్మణి. చంద్రబాబు అరెస్టును దేశమంతా ఖండిస్తోంది. ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి చంద్రబాబుకు మద్దతు తెలుపుతున్నారన్నారు బ్రాహ్మణి.
Next Story