Mon Dec 23 2024 03:08:40 GMT+0000 (Coordinated Universal Time)
Nara Brahmini : మంగళగిరిలో నారా బ్రాహ్మణి.. అందరితో మమేకమవుతూ
మంగళగిరి నియోజకవర్గంలో నారా బ్రహ్మణి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.
మంగళగిరి నియోజకవర్గంలో నారా బ్రహ్మణి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. తన భర్త లోకేష్ కు మద్దతుగా ఆమె మంగళగిరలో విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. మహిళలతో మమేకమవుతూ రానున్న ఎన్నికల్లో లోకేష్ కు మద్దతుగా నిలవాలంటూ నారా బ్రహ్మణి కోరుతున్నారు. కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న నారా లోకేష్ కు ఓట్లు వేసి గెలిపించాలని కోరుతున్నారు.
లోకేష్ ను గెలిపించాలని...
లోకేష్ మంగళగిరి ఎమ్మెల్యేగా ఎన్నికయితే చేయబోయే అభివృద్ధి పనులను కూడా నారా బ్రాహ్మణి వివరిస్తూ మహిళలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే అధికారంలో లేకపోయినా సేవా కార్యక్రమాలతో మంగళగిరి ప్రజలకు అండగా ఉన్న వైనాన్ని నారా బ్రాహ్మణి గుర్తు చేస్తున్నారు. ఈరోజు ఉండవల్లి కరకట్ట వద్ద మత్స్యకార మహిళలతో నారా బ్రాహ్మణి సమావేశమయ్యారు.
Next Story