Sat Dec 21 2024 11:00:43 GMT+0000 (Coordinated Universal Time)
ఆ ఘటనకు షాక్ అయ్యా: నారా భువనేశ్వరి
చంద్రబాబునాయుడు భార్య నారా భువనేశ్వరి ప్రజల్లోకి వెళ్లాలని
స్కిల్ కేసులో జైలులో ఉన్న చంద్రబాబుకు సంఘీభావంగా టీడీపీ మద్దతుదారులు శ్రీకాకుళం నుంచి కుప్పంకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. వారిని పుంగనూరు మండలంలో కొందరు అడ్డుకున్నారు. ఈ ఘటనను సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటన పట్ల నారా భువనేశ్వరి స్పందించారు. పుంగనూరులో శ్రీకాకుళం వాసులను చొక్కాలు విప్పించిన ఘటన చూసి తాను షాక్ కు గురయ్యానని అన్నారు.
"రాష్ట్రంలో రౌడీ రాజకీయానికి ఈ దాడి నిదర్శనం. 30 ఏళ్ల క్రితం బీహార్ లో కూడా ఇంత అరాచక పరిస్థితులు లేవు. పేదలపై పెత్తందారీ పోకడలు అంటే ఇవే! తెలుగుదేశం అంటే ఒక కుటుంబం. తండ్రి లాంటి తమ నేతను అక్రమంగా జైల్లో పెడితే బిడ్డలైన కార్యకర్తలు సైకిల్ యాత్ర చేసుకునే హక్కు కూడా లేదా? నడిరోడ్డుపై బూతులు తిడుతూ ఆ సామాన్యులకు మీరు చేసిన అవమానం ప్రజలంతా గమనించారు. ఎల్లకాలం నియంతల పెత్తనం సాగదు. అంతిమ విజయం ప్రజాస్వామ్యానిదే" అంటూ భువనేశ్వరి చెప్పుకొచ్చారు.
చంద్రబాబునాయుడు భార్య నారా భువనేశ్వరి ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వెల్లడించారు. 'నిజం గెలవాలి' పేరుతో నారా భువనేశ్వరి అక్టోబర్ 25 నుంచి రాష్ట్రంలో యాత్ర చేపట్టనున్నారు. చంద్రబాబు అరెస్ట్ అయ్యాక ఆవేదనతో మరణించినవారిని ఆమె పరామర్శిస్తారు. చంద్రగిరి నియోజకవర్గం నుంచి భువనేశ్వరి యాత్ర ప్రారంభిస్తారని నారా లోకేశ్ తెలిపారు. యాత్ర ప్రారంభానికి ముందు భువనేశ్వరి ఈ నెల 24న తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారని తెలిపారు.
Next Story