Thu Dec 19 2024 17:44:30 GMT+0000 (Coordinated Universal Time)
పొత్తుపై నారా లోకేష్.. చంద్రబాబు వ్యాఖ్యలివే!!
బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు ఉమ్మడి ప్రకటన చేశాయి. పొత్తు కుదిరిన నేపథ్యంలో
బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు ఉమ్మడి ప్రకటన చేశాయి. పొత్తు కుదిరిన నేపథ్యంలో, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ను మళ్లీ అభివృద్ధి పథంలోకి నడిపించేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ అనే మూడు శక్తులు ఏకమయ్యాయని.. చరిత్రలో ఎన్నడూ లేనంతగా గత ఐదేళ్లుగా చీకటిలో మగ్గిపోయిన రాష్ట్రానికి ఈ పొత్తు ఒక ముఖ్యమైన ఘట్టమని అభివర్ణించారు. ఈ పొత్తు చరిత్రలో నిలిచిపోతుందని.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవితకు, ప్రజల జీవితాలకు ఇదొక సానుకూల మేలి మలుపు అని వివరించారు.
పొత్తుపై చంద్రబాబు నాయుడు స్పందించారు. మళ్లీ ఎన్డీయేలో చేరడం సంతోషం కలిగిస్తోందని.. ఏపీకి, దేశానికి సేవ చేసేందుకే టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల పొత్తు అని అన్నారు. ఏపీలో బీజేపీ, జనసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధిలో కొత్త శకానికి నాంది పలికేందుకు ఎదురుచూస్తున్నామని చంద్రబాబు అన్నారు. ఈ కూటమి ప్రజాశ్రేయస్సుకు స్వర్ణయుగం తెస్తుందనే నమ్మకం ఉందని అన్నారు. చారిత్రాత్మకమైన ఈ కూటమిని ఆశీర్వదిస్తారనే విశ్వాసం తనకుందని.. ఏపీ అభివృద్ధికి, తెలుగు ప్రజల సంక్షేమానికి టీడీపీ కట్టుబడి ఉందని చంద్రబాబు తెలిపారు.
Next Story