Mon Dec 23 2024 03:33:00 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబు ఆగమన్నా వినం: నారా లోకేష్
పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం దొడ్లేరులో నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు
పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం దొడ్లేరులో నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ రెడ్డి కులం ఫ్యాక్షనిజం, మతం సైకోయిజమని.. అందుకే రాష్ట్రంలో మారణహోమం సృష్టిస్తున్నాడని అన్నారు. బ్యాంకులను ముంచేసి లక్ష కోట్లు దొబ్బి 14 నెలలు చిప్పకూడు తిన్న 420 ముఖ్యమంత్రి కావడం వల్లే టీడీపీ కేడర్ తో పాటు రాష్ట్ర ప్రజలు నరకం చూస్తున్నారన్నారు. వేలాది మందిపై తప్పుడు కేసులు బనాయించారు, ఇక మా ఓపిక నశించింది... చంద్రబాబు ఆగమన్నా ఆగేది లేదన్నారు.
మేం కార్యకర్తలను రెచ్చగొడుతున్నామని సజ్జల అంటున్నారు, మా వాళ్లను ఊచకోత కోస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? కేడర్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత నాపై ఉందని అన్నారు. ఇక మా ఓపిక నశించింది. మా వాళ్ల జోలికొస్తే జరగబోయేది యుద్ధమేనని అన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలనకు జగన్ శ్రీకారం చుట్టాడని.. అందుకు నేను ఫుల్ స్టాప్ పెడతాను. కార్యకర్తలను హతమార్చారు, తప్పుడు కేసులు పెట్టారు, ఇప్పుడు ఏకంగా మా అధినేతపైనే హత్యాయత్నం చేశారు, మరోసారి ఆయన జోలికొస్తే జరగబోయే పరిణామాలకు జగన్మోహన్ రెడ్డే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. జగన్ ఒక సైకో... చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డి లాంటి సైకోలను జిల్లాకు ఒకర్ని తయారు చేసి మా కార్యకర్తల పైకి ఉసిగొల్పుతున్నారన్నారు. వైసీపీ గూండాల మాటలు విని మా కేడర్ ను వేధించే పోలీసులను వదిలేది లేదు. 9 నెలల్లో అధికారంలోకి రాబోయేది మేమే. టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిపై జ్యుడీషియల్ విచారణ జరిపి, ఉద్యోగాల నుంచి డిస్మిస్ చేస్తామన్నారు. వైసీపీ నేతలకు తొత్తులుగా మారి మా వాళ్లను ఇబ్బంది పెట్టిన వాళ్లు మూల్యం చెల్లించుకోక తప్పదు. కేసులకు కార్యకర్తలెవరూ భయపడాల్సిన పనిలేదు. నాపై 20 కేసులు ఉన్నాయి, జేసీ ప్రభాకర్ రెడ్డిపై 74 కేసులు బనాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే కేసులుపెట్టి, దాడులు పెడుతున్నారన్నారు నారా లోకేష్.
Next Story