Sun Dec 22 2024 20:36:10 GMT+0000 (Coordinated Universal Time)
తాడేపల్లి చెతబుట్టలన్నింటిలో పగిలిపోయిన టీవీలు: నారా లోకేష్
తాడేపల్లి చెత్త బుట్టలన్నింటిలో పగిలిపోయిన టీవీలు కనిపించాయని
తాడేపల్లి చెత్త బుట్టలన్నింటిలో పగిలిపోయిన టీవీలు కనిపించాయని టీడీపీ నేత నారా లోకేష్ తెలిపారు. అందుకు కారణం తెలుగుదేశం-జనసేన-బీజేపీ పొత్తు ఎప్పుడైతే కుదిరిందో తాడేపల్లి కొంపలో టీవీలన్నీ జగన్ పగలగొట్టాడని అన్నారు. దేశంలో ఎక్కడికి వెళ్లినా కియా కార్లు చూస్తే నాకు గుర్తుకువచ్చేది అనంతపురం జిల్లా అని నారా లోకేష్ తెలిపారు. చెన్నకేశవస్వామి ఆలయం ఉన్న పుణ్యభూమి అనంతపురం జిల్లా.. రాళ్లిస్తే రత్నాలు ఇచ్చే శక్తి అనంతపురానికి ఉందన్నారు నారా లోకేష్. ఎవరైనా మంచిపనిచేస్తే జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు, జగన్ లా తప్పు చేస్తే తోలు వలిచేస్తారు.
నార్త్ కొరియాలో కిమ్ అనే నియంత ఉన్నాడు.. ఏపీలో కూడా నియంత ఉన్నాడు. అతని పేరు జిమ్. కిమ్ ఏకంగా 17 ప్యాలెస్ కు కట్టుకుంటే ఏపీలో ఉన్న జిమ్ 6 ప్యాలెస్ లు కట్టుకున్నాడన్నారు. కిమ్ సొంత అన్నను, బాబాయిని లేపేశాడు. జిమ్ కూడా బాబాయిని లేపేసి, తల్లి, చెల్లిని ఇంటినుంచి గెంటేశాడు. కిమ్ వీడియో గేమ్ లు ఆడితే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జిమ్ పబ్ జీ ఆడతాడన్నారు. నార్త్ కొరియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన 340 మందిని చంపాడు, వేలాది మంది జైలుకు పంపాడు. ఏపీలో ఉన్న జిమ్ బడుగు, బలహీన వర్గాలను వేధించి జైలుకు పంపాడన్నారు నారా లోకేష్. ఈ జిమ్ ఎవరో అర్థమైందా రాజా? ఈ జిమ్ సైకో జగన్. డిస్కవరీ యాప్ లో నార్త్ కొరియా డార్ట్ సీక్రెట్స్ కొడితే ఇవన్నీ బయటపడతాయి. ఇవన్నీ చూస్తే నాకు సైకో జగన్ గుర్తుకువచ్చాడన్నారు నారా లోకేష్.
Next Story