Wed Apr 09 2025 20:12:39 GMT+0000 (Coordinated Universal Time)
నారా లోకేశ్ కు ముందస్తు బెయిల్
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ నేత నారా లోకేశ్ కు ఏపీ హైకోర్టు

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ నేత నారా లోకేశ్ కు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది. అక్టోబర్ 4వ తేదీ వరకు బెయిల్ మంజూరు చేసింది. అప్పటి వరకు లోకేశ్ ను అరెస్ట్ చేయవద్దని సీఐడీని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను 5వ తేదీకి వాయిదా వేసింది. ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులో నారా లోకేశ్ పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను వాయిదా వేసింది. ఈ కేసులో విచారణను అక్టోబర్ 4 వరకు వాయిదా వేస్తున్నట్టు హైకోర్టు తెలిపింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేశ్ కు 41ఏ నోటీసులు ఇవ్వాలని సీఐడీని హైకోర్టు ఆదేశించింది.
ఏపీ ఫైబర్ గ్రిడ్, స్కిల్ డెవలప్ మెంట్ కేసుల్లో కూడా నారా లోకేశ్ పేరును సీఐడీ చేర్చింది. ఈ రెండు కేసుల్లో ఏపీ హైకోర్టులో నారా లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్లను దాఖలు చేశారు. ఈ పిటిషన్లను అత్యవసరంగా విచారణ జరపాలని కోర్టును లోకేశ్ కోరారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఇప్పటికే చంద్రబాబు రిమాండ్ లో ఉన్నారు.
Next Story