Mon Mar 24 2025 08:26:48 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీకి మరో ప్రతిష్టాత్మకమైన కంపెనీతో చర్చలు.. పెట్టుబడి పెట్టేందుకు
తైపేయి ఏకనామిక్ అండ్ కల్చరల్ సెంటర్ ఇన్ చెన్నై డైరెక్టర్ జనరల్ రిచర్డ్ చెన్‌తో నారా లోకేశ్ చర్చలు జరిపారు

ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్ట్రానిక్స్ , టెక్స్ టైల్స్ , ఫుట్‌వేర్ రంగాల అభివృద్ధికి తైవాన్ సహకారం అందించే మంత్రి నారా లోకేశ్. ఉండవల్లి నివాసంలో తైపేయి ఏకనామిక్ అండ్ కల్చరల్ సెంటర్ ఇన్ చెన్నై డైరెక్టర్ జనరల్ రిచర్డ్ చెన్‌తో నారా లోకేశ్ చర్చలు జరిపారు. ఎలక్ట్రానిక్స్ , టెక్స్టైల్స్ , ఫుట్‌వేర్ తయారీ రంగాల్లో తైవాన్ అగ్రగామిగా ఉండటంతో ఈ భేటీ జరిగింది.
సమావేశంలో...
ఈ సమావేశంలో ఎలక్ట్రానిక్స్ , టెక్స్టైల్స్ , ఫుట్‌వేర్ రంగాల అభివృద్ధికి తైవాన్ తీసుకొచ్చిన పాలసీలు , తీసుకున్న చర్యలు గురించి నారా లోకేశ్ తైవాన్ ప్రతినిధుల బృందాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏపీలో ఎలక్ట్రానిక్స్ , టెక్స్టైల్స్ , ఫుట్‌వేర్ రంగాల అభివృద్ధికి తీసుకొచ్చిన పాలసీలు , అనుమతుల దగ్గర ఉత్పత్తి ప్రారంభం ప్రభుత్వ సహకారం గురించి మంత్రి వివరించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ పద్దతిలో కంపెనీల ఏర్పాటుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి పలు ఉదాహరణలతో వివరించారు.
Next Story