Tue Dec 17 2024 04:35:25 GMT+0000 (Coordinated Universal Time)
Nara Lokesh : జగన్ కు భాస్కర్ అవార్డు ఇవ్వాల్సిందే
తాము అధికారంలోకి రాగానే అమరావతి పనులు ప్రారంభిస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు
తాము అధికారంలోకి రాగానే అమరావతి పనులు ప్రారంభిస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. మంగళగిరి మండలం నీరుకొండలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాజధానిలో పేదలకు ఇచ్చే ఐదు వేల రూపాయల పింఛన్‌ను కొనసాగిస్తామని ఈ సందర్భంగా లోకేష్ హామీ ఇచ్చారు.
కౌలును వడ్డీతో సహా...
రాజధాని ప్రాంతంలో అసైన్డ్ రైతులకు ఇవ్వాల్సిన కౌలును వడ్డీతో సహా చెల్లిస్తామని లోకేష్ తెలిపారు. గులకరాయి ఘటనలో జగన్‌కు ఆస్కార్ కు బదులు భాస్కర్ అవార్డు ఇవ్వాలంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సెటైర్ వేశారు. ఈసారి కూటమి విజయాన్ని ఎవరూ ఆపలేరని లోకేష్ అన్నారు.
Next Story