Sun Jan 12 2025 10:49:41 GMT+0000 (Coordinated Universal Time)
అల్లుడితో మామ తొలి అడుగు
రేపు నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభం కానుంది. తిరుమల నుంచి కుప్పం చేరుకున్న లోకేష్ పాదయాత్ర కమిటీలతో చర్చిస్తున్నారు
రేపు నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభం కానుంది. ఇప్పటికే తిరుమల నుంచి కుప్పం చేరుకున్న లోకేష్ పాదయాత్ర కమిటీలతో చర్చిస్తున్నారు. అయితే రేపు ఉదయం 11.03 గంటలకు నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభం కానుంది. ఈ పాదయాత్రను నందమూరి బాలకృష్ణ జెండా ఊపి ప్రారంభించనున్నారు. అల్లుడు లోకేష్ తో కలసి కొంత దూరం ఆయన కూడా నడవనున్నారు
యువగళానికి మద్దతుగా...
యువగళం యువత భవిష్యత్ కు పునాది అని నందమూరి బాలకృష్ణ తెలిపారు. యువగళం పాదయాత్రకు అనుసంధానంగా అనేక కార్యక్రమాలను చేపట్టనున్నట్లు బాలయ్య వివరించారు. లోకేష్ యువగళాన్ని విజయవంతం చేయాలని, పాదయాత్రను ఆశీర్వదించాలని బాలయ్య కోరారు. యువత తమ భవిష్యత్ గురించి ఆలోచించి యువగళంకు మద్దతు ఇవ్వాలని బాలయ్య పిలుపు నిచ్చారు.
Next Story