Mon Dec 23 2024 05:12:15 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై నారా లోకేష్ రియాక్షన్ ఇదే
చంద్రబాబు నాయుడు అరెస్టు నేపథ్యంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిరసనకు దిగారు.
చంద్రబాబు నాయుడు అరెస్టు నేపథ్యంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిరసనకు దిగారు. కోనసీమ జిల్లా రాజోలు మండలం పొదలాడలో ఉన్న లోకేశ్ విజయవాడ బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. నారా లోకేష్ ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో రాజోలు సీఐ గోవిందరాజుతో లోకేశ్ వాగ్వాదానికి దిగారు. ఏ విధమైన నోటీసు ఇవ్వకుండా ఎలా అడ్డుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వెంట టీడీపీ నాయకులు ఎవరూ రావడం లేదు.. కుటుంబ సభ్యుడిగా నేను ఒక్కడినే వెళ్తున్నానని నారా లోకేష్ అన్నారు. తనను అడ్డుకునే హక్కు మీకు ఎవరు ఇచ్చారని లోకేష్ నిలదీశారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా క్యాంప్ సైట్ వద్ద తన బస్సు ముందే బైఠాయింది లోకేశ్ నిరసన తెలిపారు.
అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులతో.. ఏ కేసులో ఏ నేరంలో తన వద్దకు వచ్చారు అని చంద్రబాబు ప్రశ్నించారు. తన హక్కులు ఉల్లంఘిస్తున్నారని అన్నారు. అసలు ఏ చట్ట ప్రకారం తనను అరెస్ట్ చేస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రాథమిక ఆధారాలు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని నిలదీశారు. కనీసం ఎఫ్ఐఆర్లో తన పేరు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. అరెస్ట్ చేసేటప్పుడు తనకు ప్రాథమిక ఆధారాలు ఇవ్వాలి కదా అని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. 24 గంటలలో అన్ని ఇస్తామని పోలీసులు చెప్పారు. ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని న్యాయవాదులు అడుగుతున్నారు. రాత్రి 1 గంటకు రావాల్సిన అవసరం ఏముందని చంద్రబాబు ప్రశ్నించారు.
Next Story