Mon Dec 23 2024 16:41:23 GMT+0000 (Coordinated Universal Time)
రెండు నెలలో ఓపిక పడితే ప్రభుత్వం మనదే
జగన్ అందరినీ మోసం చేశారని, యువత, మహిళలను కూడా వంచించారని లోకేష్ అన్నారు
మోసానికి ప్యాంట్, షర్ట్ వేస్తే అది జగన్ రెడ్డి అని నారా లోకేష్ అన్నారు. పాతపట్నం శంఖారావం సభలో యువనేత లోకేష్ ప్రసంగించారు. జాబ్ కేలండర్ కాస్తా సాక్షి కేలండర్ లా మారింది. డీఎస్సీ మోసం, బీసీ ఫీజు రీయింబర్స్ మెంట్, విదేశీ విద్య, 6500 కానిస్టేబుల్ పోస్టులు ప్రతి ఏడాది భర్తీ చేస్తామని చెప్పి మాట తప్పారన్నారు. ఎన్నికలకు ముందు డీఎస్సీ అంటూ మోసం చేస్తున్నారని, ఇప్పుడు కేవలం రెండు నెలల సమయం మాత్రమే ఉందని, సమయం లేకపోవడమే కాదు.. పోస్టులు కూడా తక్కువ. 800 గ్రూప్ -2 పోస్టులకు 5 లక్షల మంది రాశారన్నారు. ఇది ప్రజలకు జగన్ రెడ్డి చేసిన మోసం కాదా? అని ప్రశ్నించారు.
వచ్చేది మన ప్రభుత్వమే...
రెండు నెలలు ఓపికపడితే టీడీపీ-జనసేన ప్రభుత్వం వస్తుందని, ఏటా జాబ్ కేలండర్ ఇస్తామని, ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని.నిరుద్యోగులు అధైర్యపడవద్దని ఆయన తెలిపారు. లక్షలు ఖర్చుపెట్టి కోచింగ్ లు తీసుకుంటున్నారని, ఉద్యోగాలు లేక రాష్ట్రంలో పెద్దఎత్తున నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని లోకేష్ అన్నారు. జగన్ బిల్డప్ బాబాయి. కోట్లు ఖర్చు పెట్టి యాత్ర-2 సినిమా తీశారు. అది కాస్తా వైకాపా నాయకులకు అంతిమయాత్ర అయింది అంటూ విమర్శించారు.
Next Story