Fri Dec 27 2024 12:02:29 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ ఆటవికపాలనకు ఈ హత్యే నిదర్శనం : లోకేష్
ఐదేళ్లుగా జగన్ సాగించిన ఆటవిక పాలన, ఎన్నికల కోడ్ వచ్చాక కూడా కొనసాగడం ఆందోళన కలిగిస్తోందని లోకేష్ అన్నారు
ఐదేళ్లుగా జగన్ సాగించిన ఆటవిక పాలన, ఎన్నికల కోడ్ వచ్చాక కూడా కొనసాగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని టీడీపీ నేత నారా లోకేష్ అన్నారు. జగన్ గొడ్డలితో తెగబడితే, వైసీపీ కార్యకర్తలు వేటకొడవళ్లతో జనాల్ని వేటాడుతున్నారన్నారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు ఏం చేస్తున్నారు? అని నారా లోకేష్ ప్రశ్నించారు. శ్రీసత్యసాయి జిల్లా నల్లమాడ మండలం కుటాలపల్లిలో టీడీపీ కార్యకర్త అమర్నాథరెడ్డి హత్యని తీవ్రంగా ఖండించారు.
వైసీపీ సైకోల పనే...
ఇది ముమ్మాటికీ వైసీపీ సైకోల పనేనంటూ లోకేష్ అన్నారు. . ఓటమి భయంతో తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక కార్యకర్తల్ని అంతమొందిస్తున్నారన్నారు. అధికారం అండతో చెలరేగుతున్న వైసీపీ కాలకేయులకు ఇదే తన హెచ్చరిక అని. వైసీపీ నేతలకు రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు. జగన్ రెడ్డి ముఠాని నమ్ముకుని హత్యలకు పాల్పడితే..మిమ్మల్ని ఎవ్వడూ కాపాడలేరని నారా లోకేష్
అన్నారు.
Next Story