Mon Dec 23 2024 09:21:24 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీ కుట్రలను అడ్డుకుంటాం
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఎట్టిపరిస్థితుల్లో ప్రయివేటు పరం కాబోనివ్వమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఎట్టిపరిస్థితుల్లో ప్రయివేటు పరం కాబోనివ్వమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ప్రారంభమయిన ఉద్యమం నేటికి ఏడాది పూర్తయిన సందర్భంగా నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఏడాది నుంచి పోరాటం చేస్తున్న కార్మికులకు ఉద్యమాభివందనాలు అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను తొలి నుంచి తమ పార్టీ వ్యతిరేకిస్తుందని తెలిపారు.
ప్రయివేటీకరించడానికి....
ఏడాది నుంచి పార్లమెంటులో తమ పార్టీ సభ్యులు ఈ విషయంపై నిరసన గళం వినిపిస్తూనే ఉన్నారని లోకేష్ తెలిపారు. విశాఖ ఉక్కును ప్రయివేటీకరించకుండా 22 మంది వైసీపీ ఎంపీ లు ఏం చేస్తున్నారని నారా లోకేష్ ప్రశ్నించారు. వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించిన విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరించేందుకు అంగీకరించబోమని తెలిపారు. అధికార పార్టీ చేసిన కుట్రలను తెలుగుదేశం పార్టీ సమర్థవంతంగా అడ్డుకుంటుందని ప్రశ్నించారు.
Next Story