Tue Nov 05 2024 12:25:56 GMT+0000 (Coordinated Universal Time)
తాడికొండ నియోజకవర్గంలో నారా లోకేష్ తల ఎత్తి చూడగా!
తాడికొండ నియోజకవర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటన ఎంతో ఘనంగా
తాడికొండ నియోజకవర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటన ఎంతో ఘనంగా సాగింది.184వరోజు యువగళం పాదయాత్ర రావెల శివారు క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైన పొన్నెకల్లు మీదుగా తాడికొండ అడ్డరోడ్డువద్దకు చేరుకుంది. ఈ పర్యటనలో ఆయనకు అపూర్వ స్వాగతం పలికారు. ఆకాశంలో భారీ హాట్ ఎయిర్ బెలూన్ తో వినూత్న్స రీతిలో పూలు,స్మోక్ క్యాన్లు, ఫైర్ షాట్లతో స్వాగతం పలికారు. గుంటూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ ఈ ఏర్పాట్లు చేశారు. నారా లోకేష్, ఆయన అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆకాశంలో ఈ అరుదైన స్వాగతం పలికినప్పుడు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు.
యువగళం పాదయాత్రలో భాగంగా తాడికొండలో ఆడిటర్లతో లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు. ఆడిటర్లు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. సీఐడీ ద్వారా ప్రభుత్వ వేధింపులను ఆడిటర్లు నారా లోకేశ్ దృష్టికి ఆడిటర్లు తీసుకెళ్లారు. చార్డెడ్ అకౌంటెంట్లపై సీఐడీ ద్వారా ప్రభుత్వం కేసులు పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడిటర్లు, చార్టెడ్ అకౌంటెంట్లకు సంబంధం లేని వ్యవహారాల్లో కేసులు పెట్టారని రాజకీయ కక్షలతో అరెస్టులు చేశారని లోకేశ్‌కు తెలిపారు. నారా లోకేష్ మాట్లాడుతూ రాజకీయాలు, వృత్తి వేర్వేరని.. కానీ వైసీపీ ప్రభుత్వం ప్రతి దాన్నీ రాజకీయంగానే చూస్తోందన్నారు. మార్గదర్శిపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధిస్తోందని విమర్శించారు. జగన్ సీఎం కాగానే ప్రజావేదిక కూల్చడంతోనే విధ్వంసం మొదలుపెట్టారు. అమరావతిని నాశనం చేశారన్నారు. కంపెనీలు పొరుగు రాష్ట్రాలకు తరలి వెళ్తున్నాయన్నారు. ఆడిటర్లకు రాష్ట్రంలో పనిలేకుండా పోయిందని తెలిపారు.
Next Story