Fri Feb 28 2025 02:30:48 GMT+0000 (Coordinated Universal Time)
సీఎం జగన్ కు శుభాకాంక్షలు చెప్పిన నారా లోకేష్
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి టీడీపీ నేత నారా లోకేష్ శుభాకాంక్షలు చెప్పారు

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి టీడీపీ నేత నారా లోకేష్ శుభాకాంక్షలు చెప్పారు. ఇంతకూ ఏ విషయంలో అని మీకు అనుమానాలు ఉన్నాయా? అది సీఎం జగన్ జైలు నుండి బయటకు వచ్చినందుకు..! ఏపీ ముఖ్యమంత్రి జగన్ బెయిల్ పై బయటకు వచ్చి నేటికి సరిగ్గా 10 ఏళ్లు పూర్తయిందని చెబుతూ నారా లోకేశ్ సెటైర్లు వేశారు. జైలు మోహన్ రెడ్డికి బెయిల్ డే పదో వార్షికోత్సవ శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు.
42 వేల కోట్ల ప్రజాధనం దోచేసి, సీబీఐ-ఈడీ పెట్టిన 38 కేసుల్లో ఏ1 అయినా పదేళ్లుగా బెయిలుపై ఉన్న ఆర్థిక ఉగ్రవాది అంటూ మండిపడ్డారు నారా లోకేష్. జైలు మోహన్ ప్రజాస్వామ్య వ్యవస్థల్ని ధ్వంసం చేస్తూ, రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా నీతిమంతుల్ని జైలుకు పంపుతున్నాడని అన్నారు. జైలులో ఉండాల్సిన జగన్ పదేళ్లుగా బెయిలుపై ఉంటే, జనంలో ఉండాల్సిన నిజాయితీపరుడు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నారని అన్నారు.
ఇదీ ట్వీట్:
"బెయిల్ డే పదో వార్షికోత్సవ శుభాకాంక్షలు జైలు మోహన్. 42 వేల కోట్లు ప్రజాధనం దోచేసి, సీబీఐ-ఈడీ పెట్టిన 38 కేసుల్లో ఏ1 అయినా పదేళ్లుగా బెయిలుపై ఉన్న ఆర్థిక ఉగ్రవాది జైలు మోహన్ ప్రజాస్వామ్య వ్యవస్థల్ని ధ్వంసం చేస్తూ, రాజ్యాంగాన్ని కాలరాస్తూ, నీతిమంతుల్ని జైలుకు పంపుతున్నాడు . జైలులో ఉండాల్సిన జగన్ పదేళ్లుగా బెయిలుపై ఉంటే, జనంలో ఉండాల్సిన నిజాయితీపరుడు సీబీఎన్ జైలులో ఉన్నారు.
#Happy10thBailAnniversaryJagan" అంటూ పోస్టు పెట్టారు నారా లోకేష్.
News Summary - nara lokesh wishes to cm jagan mohan reddy Bail Day 10th Anniversary Wishes Jail Mohan
Next Story