Mon Dec 23 2024 02:25:58 GMT+0000 (Coordinated Universal Time)
లోకేష్ కు చంద్రబాబు శుభాకాంక్షలు.. కలిసి నడిచిన నారా హీరో
టీడీపీ యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 200వ రోజుకు చేరుకుంది.
టీడీపీ యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 200వ రోజుకు చేరుకుంది. ఈ ఏడాది జనవరి 27న ప్రారంభమైన పాదయాత్ర కొనసాగుతోంది. ఇప్పటి వరకు 77 నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగింది. లోకేశ్ ఇప్పటి వరకు 2,710 కిలోమీటర్లు నడిచారు. 64 బహిరంగ సభలు, 132 ముఖాముఖి సమావేశాల్లో లోకేశ్ పాల్గొన్నారు. పాదయాత్ర 200వ రోజుకు చేరుకున్న సందర్భంగా లోకేశ్ కు టీడీపీ నేతలు, కార్యకర్తలు అభినందనలు తెలియజేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా తన కుమారుడికి శుభాకాంక్షలు తెలిపారు. యువగళంగా ప్రారంభమైన పాదయాత్ర... ప్రజాగళంగా మారిందని చంద్రబాబు ప్రశంసించారు.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం శివారు దండమూడి కళ్యాణ మండపం నుండి 200వ రోజు యువగళం పాదయాత్రను లోకేశ్ ప్రారంభించారు. పాదయాత్ర 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా లోకేశ్ కు సంఘీభావంగా ఆయన తల్లి నారా భువనేశ్వరితో పాటు నందమూరి, నారా కుటుంబ సభ్యులు పాదయాత్రలో పాల్గొన్నారు. లోకేశ్ తో కలిసి సినీ నటుడు నారా రోహిత్ నడిచారు. 200 రోజుల పాదయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా కొయ్యలగూడెం లో గిరిజనులతో ముఖాముఖి సమావేశంలో లోకేశ్ పాల్గొననున్నారు. పాదయాత్ర 200వ రోజున 2,700 కిలోమీటర్లకు చేరుకున్న నేపథ్యంలో పోలవరం నియోజకవర్గం సీతంపేట వద్ద లోకేశ్ పైలాన్ ను ఆవిష్కరించారు.
Next Story