Mon Dec 23 2024 03:37:04 GMT+0000 (Coordinated Universal Time)
ఉద్వేగానికి గురైన భువనేశ్వరి
రాజమండ్రిలో నారా భువనేశ్వరి ఒకరోజు దీక్ష విరమించారు. తమ కుటుంబానికి ఇలాంటి పరిస్థితి వస్తుందని తాము ఊహించలేదన్నారు
రాజమండ్రిలో నారా భువనేశ్వరి ఒకరోజు దీక్ష విరమించారు. తమ కుటుంబానికి ఇలాంటి పరిస్థితి వస్తుందని తాము ఊహించలేదన్నారు. రాష్ట్రం, ప్రజల బాగు కోసమే చంద్రబాబు పనిచేశారని ఆమె అన్నారు. చంద్రబాబుపై నమ్మకంతోనే హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టారని అన్నారు. ప్రజల కోసం చంద్రబాబు రోజుకు మూడు, నాలుగు గంటలు మాత్రమే నిద్రపోయేవారన్నారు. చంద్రబాబు అరెస్ట్ తో గుండెపోటుతో మరణించిన వారి కుటుంబ సభ్యులను తాను స్వయంగా వెళ్లి పరామర్శిస్తానని చెప్పారు. చంద్రబాబు కోసం 105 మంది మరణించారని ఆమె తెలిపారు.
ఆ కుటుంబాలకు అండగా నిలబడతా
తన ఆయుష్షు కూడా పోసుకుని చంద్రబాబు జీవించాలని ఆమె ఉద్వేగ్నంగా ప్రసంగించారు. అవసరమైనప్పుడు తాను ప్రజలతోనే ఉంటానని, వారి కోసమే పోరాడతానని భువనేశ్వరి తెలిపారు. హైదరాబాద్లో ఐటీ అభివృద్ధికి చంద్రబాబు ఎంతో కృషి చేశారన్నారు. చంద్రబాబు రోజుకు 19 గంటలు ప్రజల కోసం పనిచేసేవారన్నారు. ఈ సారి మీ ఓటును సరిగా వేయాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని చంద్రబాబు పరితపించేవారని భువనేశ్వరి అన్నారు. దీక్షలో పాల్గొన్న వాళ్లందరికీ భువనేశ్వరి ధన్యావాదాలు తెలిపారు. తాము ఎప్పుడూ అధికారాన్ని దుర్వినియోగం చేయలేదని చెప్పారు.
Next Story