Thu Apr 24 2025 18:14:02 GMT+0000 (Coordinated Universal Time)
కన్నీటి పర్యంత మయిన కాబోయే కేంద్ర మంత్రి
నరసాపురం పార్లమెంటు సభ్యుడు శ్రీనివాసవర్మ తనకు కేంద్ర మంత్రి పదవి దక్కడం పట్ల భావోద్వేగానికి లోనయ్యారు.

నరసాపురం పార్లమెంటు సభ్యుడు శ్రీనివాసవర్మ తనకు కేంద్ర మంత్రి పదవి దక్కడం పట్ల భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన ఊహించని విధంగా కేంద్ర కేబినెట్ లో చోటు దక్కినందుకు బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు పాదాభివందనం చేశారు. ఆనందంతో ఆయనకళ్లు చెమర్చాయి. ఇది కార్యకర్తల విజయంగా శ్రీనివాస వర్మ అభినందించారు.
మార్గదర్శనం చేయాలంటూ...
తనకు మార్గదర్శనం చేయాలంటూ సోము వీర్రాజును శ్రీనివాస్ వర్మ కోరారు. సోము వీర్రాజును ఆలింగనం చేసుకుని ఇది కార్యకర్తలకు దక్కిన బహుమతి అని శ్రీనివాస వర్మ అన్నారు. నరసాపురం లోక్సభ టిక్కెట్ దక్కినప్పుడు కూడా శ్రీనివాస వర్మ భావోద్వేగానికి గురై కమలం గుర్తుపై పడుకుని కన్నీటి పర్యంత మయ్యారు. మూడు దశాబ్డాల నుంచి శ్రీనివాసవర్మ బీజేపీలో పనిచేస్తున్నారు.
Next Story