Mon Dec 23 2024 03:37:03 GMT+0000 (Coordinated Universal Time)
విజయమ్మ ప్రమాదం వెనక కుట్ర
నిన్న వైఎస్ విజయమ్మకు జరిగిన ప్రమాదంపై అనుమానాలున్నాయని నరసాపురం ఎంపీ రఘరామ కృష్ణరాజు అన్నారు
నిన్న వైఎస్ విజయమ్మకు జరిగిన ప్రమాదంపై అనుమానాలున్నాయని నరసాపురం ఎంపీ రఘరామ కృష్ణరాజు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆ వాహనం కేవలం 3,500 కిలోమీటర్లు మాత్రమే తిరిగిందన్నారు. ట్యూబ్ లెస్ టైర్లు ఒకేసారి పేలవని, రెండు టైర్లు ఒకేసారి పేలడంపై పలు అనుమానాలు కలుగుతున్నాయని రఘరామ కృష్ణరాజు అభిప్రాయపడ్డారు. ఇందులో ఏదో కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. వైఎస్ విజయమ్మ క్షేమంగా ప్రమాదం నుంచి బయటపడినందుకు సంతోషంగా ఉందని ఆయన తెలిపారు.
విచారణ జరపాలని....
అదే సమయంలో ఈ ప్రమాదానికి కారణాలపై జగన్ ప్రభుత్వం విచారణ చేపట్టాలని ఆయన కోరారు. తాను విజయమ్మతో మాట్లాడే ప్రయత్నం చేసినా వీలు పడలేదని చెప్పారు. ముఖ్యమంత్రి దుష్టచతుష్టయం అని నిత్యం అంటుంటారు కాబట్టి విచారణ జరిపించాలని రఘరామ కృష్ణరాజు కోరారు. ముఖ్యమంత్రి కుటుంబంలో ఇలా జరగడం బాధాకరమని అని, గతంలో బాబాయిని కూడా కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Next Story