Sun Nov 17 2024 11:02:34 GMT+0000 (Coordinated Universal Time)
రఘురామ కృష్ణరాజుకు సుప్రీంకోర్టు షాక్
నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజుకు సుప్రీంకోర్టులో చుక్కెదురయింది.
నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజుకు సుప్రీంకోర్టులో చుక్కెదురయింది. తన సెక్యూరిటీ సిబ్బందిపైన, కుమారుడిపైన దాఖలయిన ఎఫ్ఐఆర్ ను రద్దు చేయాలని ఆయన సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు. అయితే దీనిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. పిటీషన్ ను డిస్మస్ చేసింది. హైదరాబాద్ లోని రఘురామ కృష్ణరాజు ఇంటివద్ద ఒక వ్యక్తిని పట్టుకుని సెక్యూరిటీ సిబ్బంది నిర్బంధించారు. అయితే అతను ఏపీ ఇంటలిజెన్స్ కానిస్టేబుల్ అని తేలింది. అతనిపై రఘురామ కృష్ణరాజు సిబ్బందితో పాటు ఆయన కుమారుడు కూడా దాడి చేశారన్న ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ దాఖలయింది.
పిటీషన్ కొట్టివేస్తూ....
దీనిపై గతంలో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా దానిని కొట్టివేసింది. తిరిగి రఘురామ కృష్ణరాజు సుప్రీంకోర్టును ఆశ్రయించి ఎఫ్ఐఆర్ ను కొట్టేయాలంటూ పిటీషన్ వేశారు. అయితే ఇంటలిజెన్స్ కానిస్టేబుల్ ను నిర్భంధించారని, దీనిపై కేసు విచారణలో ఉందని తెలపడంతో కోర్టు రఘురామ కృష్ణరాజు పిటీషన్ ను తోసి పుచ్చింది. కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని పోలీసులు పేర్కొన్నారు. తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పారు. ఈ అంశంలో సీఆర్పీఎఫ్ సిబ్బంది కూడా సస్పెండ్ అయ్యారని పేర్కొంది. దీంతో సుప్రీంకోర్టు ఈ పిటీషన్ ను కొట్టివేసింది.
Next Story