Mon Dec 23 2024 03:58:08 GMT+0000 (Coordinated Universal Time)
Narendra Modi : కాంగ్రెస్, జగన్ ఒక్కటే.. అవినీతి ప్రభుత్వాన్ని కాకుండా ఎన్డీఏను గెలిపించండి
ఆంధ్రప్రదేశ్ లో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు
ఆంధ్రకుటుంబ సభ్యులందరికీ నమస్కారం అంటూ ప్రధాని మోదీ ప్రసంగించారు. తెలుగులో ఆయన ప్రసంగాన్ని ప్రారంభించారు. కోటప్ప కొండ వద్ద బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుల ఆశీర్వాదం లభించిందన్నారు. త్రిమూర్తుల ఆశీర్వాదం లభించినట్లయిందన్నారు. నిన్ననే ఎన్నికల షెడ్యూల్ వచ్చిందన్నారు. ఎన్డీఏకు ఓట్లు వేయాలని ఆయన కోరారు. రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 400కుపైగా సీట్లు వచ్చేలా కృషి చేయాలని కోరారు. చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ లు మీ హక్కుల కోసం రేయింబవళ్ళూ పోరాడుతున్నారన్నారు. ఇక్కడి ప్రజల కోసం కష్టపడుతున్నారన్నారు. ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ ను ఏర్పాటు చేేసే దిశగా ప్రయత్నించాలన్నారు. అప్పుడే ఏపీలో అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఎన్డీఏ కూటమి లక్ష్యం అభివృద్ధి చెందిన భారత దేశమని అన్నారు.
పేదల కోసం ఆలోచించేంది....
దేశంలో ఎన్డీఏ బలం పెరుగుతోందన్నారు. పేదల కోసం ఆలోచించేది ఎన్డీఏ ప్రభుత్వమేనని అన్నారు. కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం దేశంలో ఉన్న పేదలందరికీ సేవలందిస్తామని తెలిపారు. వారి కోసం ఆలోచించేది ఎన్డీఏ ప్రభుత్వమేనని అన్నారు. 30 కోట్ల మంది పేదలను పేదరికం నుంచి వెలుపలకు తీసుకు వచ్చామన్నారు. రాష్ట్రానికి ప్రధాని ఆవాస యోజన పథకం కింద పది లక్షల ఇళ్లు ఇచ్చామన్నారు. పల్నాడు ప్రాంతంలోనే ఐదు వేల ఇళ్లు మంజూరయ్యాయని ఆయన తెలిపారు. ఏపీలో కోటి కుటుంబాలకు ఉచితంగా నల్లా కనెక్షన్లు ఇచ్చామన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం కోటి పాతిక లక్షల మందికి ఉచిత వైద్యం అందించడం జరిగిందని మోదీ తెలిపారు. చిన్న, సన్నకారు రైతులకు 700 కోట్ల రూపాయలు ఏపీలో ఇచ్చామని తెలిపారు.
చంద్రబాబు చేరికతో...
చంద్రబాబు చేరికతో ఎన్డీఏ బలం మరింత పెరిగిందని మోదీ అన్నారు. జూన్ 4న ఫలితాల్లో ఎన్డీఏకు నాలుగు వందలు దాటాలన్నారు. వికసిత్ భారత్, వికసిత్ ఏపీ ఎన్డీఏ లక్ష్యమని మోదీ అన్నారు. ఆంధ్రరాష్ట్రంలో ఉన్న అనేక ప్రముఖ సంస్థలను కేంద్ర ప్రభుత్వం నెలకొల్పిందన్నారు. కాంగ్రెస్ మహాకూటమితో మీ ముందుకు వస్తుందని, దానిని నమ్మితే దేశం వెనకబడి పోతుందని మోదీ అన్నారు. కేరళలో ఆ కూటమిలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్నారు. వారిది యూజ్ అండ్ త్రో పాలసీ అని అన్నారు. ఎన్డీఏ హయాంలోనే ఏపీ ఎడ్యుకేషన్ హబ్ గా మారిందన్నారు. అయోధ్యలో రామ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని, రాముడు అంటే నందమూరి తారకరామారావు గుర్తుకు వస్తారని ఆయన అన్నారు.
మంత్రుల అవినీతి వల్లనే...
అయోధ్య ప్రతిష్ట రోజు తనకు అదే గుర్తుకు వచ్చిందన్నారు. ఎన్డీఆర్ స్మారక నాణేన్ని కూడా విడుదల చేశామన్నారు.అవినీతి విషయంలో ఏపీ మంత్రులు పోటీ పడుతున్నారని మోదీ అన్నారు. ఏపీలో జగన్, కాంగ్రెస్ ఒకటేనని, ఒకే కుటుంబానికి చెందిన పార్టీలని, ఐదేళ్లలో రాష్టం అభివృద్ధిలో కుంటుపడిందన్నారు. ప్రభుత్వం అవినీతి వల్లనే అభివృద్ధి జరగలేదన్నారు. ఓట్లు చీలకుండా ఎన్డీఏకే ఓటు వేయాలని మోదీ పిలుపు నిచ్చారు. కాంగ్రెస్, వైసీపీ మధ్య రహస్య ఒప్పందం ఉందన్నారు. అభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్కరూ ఎన్డీఏకు అండగా నిలబడాలన్నారు.
Next Story