Tue Dec 24 2024 20:45:25 GMT+0000 (Coordinated Universal Time)
మెగా బ్రదర్స్ తో మోదీ
చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మెగా బ్రదర్స్ తో కాసేపు సరదాగా గడిపారు
చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మెగా బ్రదర్స్ తో కాసేపు సరదాగా గడిపారు. ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత పవన్ కల్యాణ్ అభ్యర్థన మేరకు తన సోదరుడు చిరంజీవి వేదికపైనే ఉన్నారని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ పవన్ చేతులు పట్టుకుని మరీ చిరంజీవి వద్దకు వచ్చారు.
ఆలింగనం చేసుకుని...
చిరంజీవిని ఆలింగనం చేసుకున్నారు. ఇద్దరు సోదరులతో కలసి ప్రజలకు అభివాదం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి ఇరువైపుల చిరంజీవి, పవన్ కల్యాణ్ ఉండటంతో అందరూ లేచి నిలబడి చప్పట్లతో హర్షధ్వనాలు చేశారు. అనంతరం మోదీ సూపర్ స్టార్ రజనీకాంత్ దంపతులను ప్రత్యేకంగా పలుకరించారు. అందరు కేంద్రమంత్రులను ప్రధాని వేదికపై పలుకరించారు.
Next Story