Sun Nov 17 2024 21:52:11 GMT+0000 (Coordinated Universal Time)
Narendra Modi : పాల సముద్రంలో మోదీ పర్యటన ఇలా
ప్రధాని నరేంద్రమోదీ పర్యటన శ్రీ సత్యసాయి జిల్లాలో కొనసాగుతుంది. తొలుత లేపాక్షిని సందర్శించిన మోదీ అక్కడ పూజలు చేశారు
ప్రధాని నరేంద్రమోదీ పర్యటన శ్రీ సత్యసాయి జిల్లాలో కొనసాగుతుంది. తొలుత లేపాక్షిని సందర్శించిన మోదీ అక్కడి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే పాలసముద్రంలో నాసిన్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. 1500 కోట్ల రూపాయలతో 503 ఎకరాల్లో నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, అండ్ నార్కోటిక్స్ ను ఆయన ప్రారంభించారు. ప్రధాని వెంట ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో పాటు గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కూడా పాల్గొన్నారు. నాసిన్ విశేషాలను అక్కడి అధికారులు మోదీకి వివరించారు.
ఐఆర్ఎస్ అధికారులకు...
ఐఆర్ఎస్ అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేందుకు ఈ భవనాలను వినియోగిస్తారు. పాలసముద్రంలో నిర్మించిన అత్యంత ఆధునిక సౌకర్యాలతో కూడుకున్న ఈ భవనాన్ని శిక్షణకు మాత్రమే వినియోగిస్తారు. అంతకు ముందు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న మోదీకి ఘన స్వాగతం పలికారు. లేపాక్షిని సందర్శించిన మోదీ అక్కడ భజనల్లో పాల్గొన్నారు. మోదీ రాక సందర్భంగా ప్రత్యేకంగా అక్కడ రాములోరి పాటలను పాడి అలరించారు. ప్రస్తుతం ఐఆర్ఎస్ అధికారులతో ఆయన సమావేశమవుతారు. వారితో చర్చిస్తారు. అనంతరం ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు.
Next Story