Mon Dec 23 2024 00:07:26 GMT+0000 (Coordinated Universal Time)
పాదయాత్ర చేస్తున్నా.. లోకేష్ ప్రకటన
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర చేయనున్నారు. ఈ మేరకు ఆయన అధికారికంగా ప్రకటించారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర చేయనున్నారు. ఈ మేరకు ఆయన అధికారికంగా ప్రకటించారు. జనవరి 27వ తేదీ నుంచి తాను రాష్ట్రంలో పాదయాత్ర ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. మంగళగిరి నియోజకవర్గంలో పార్టీ బాధ్యతలను కార్యకర్తలే చూసుకోవాలని ఆయన కోరారు.
4 వేల కిలోమీటర్లు....
మొత్తం నాలుగు వందల రోజుల పాటు నాలుగు వేల కిలోమీటర్లకు పైగానే తన పాదయాత్ర ఉంటుందని ఆయన తెలిపారు. ఏడాదికి పైగానే నిర్వహించనున్న ఈ యాత్ర సక్సెస్ చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. తాను పోటీ చేయనున్న మంగళగిరిలో నాలుగు రోజుల పాటు పాదయాత్ర చేస్తానని నారా లోకేష్ తెలిపారు.
Next Story