Sun Apr 13 2025 19:54:30 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో ఎన్ఐఏ సోదాలు
మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ భార్య శిరీష ఇంట్లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సోదాలు నిర్వహిస్తుంది.

మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ భార్య శిరీష ఇంట్లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సోదాలు నిర్వహిస్తుంది. ఆలకూరపాడులోని ఆమె ఇంట్లో ఎన్ఐఏ సోదాలు జరుపుతోంది. అలాగే విరసం నేత కల్యాణరావు నివాసంలోనూ ఎన్ఐఏ సోదాలు ఈరోజు ఉదయం నుంచి నిర్వహిస్తుంది.
ఏకకాలంలో...
ఏకకాలంలో రెండు చోట్ల విడిపోయి సోదాలు నిర్వహిస్తున్నారు. ఉదయం ఆరు గంటల నుంచే సోదాలను అధికారులు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో ఎటువంటి పత్రాలను స్వాధీనం చేసుకున్నారన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. సోదాలను నిర్వహించే విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచారు.
Next Story