Thu Dec 19 2024 17:12:54 GMT+0000 (Coordinated Universal Time)
లోకేష్ కు ఢిల్లీలో మద్దతు
స్కిల్ డెవలెప్మెంట్ స్కాం కేసులో అరెస్టయిన చంద్రబాబుకు జాతీయ నేతలు అండగా నిలుస్తున్నారు
స్కిల్ డెవలెప్మెంట్ స్కాం కేసులో అరెస్టయిన చంద్రబాబుకు జాతీయ నేతలు అండగా నిలుస్తున్నారు. ఆయన కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ చేస్తున్న న్యాయపోరాటానికి జాతీయ పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను జాతీయ నేతలు పరామర్శించారు. తమ మద్దతు ప్రకటించారు.
హర్యానా డిప్యూటీ సీఎంతో పాటు...
నారా లోకేష్ ను హర్యానా డిప్యూటీ సీఎంతో పాటు బీఎస్పీ పార్లమెంటు సభ్యులు కలసి తమ మద్దతును తెలిపారు. తప్పుడు కేసులు పెట్టి చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారంటూ పార్టీ చేస్తున్న న్యాయపోరాటానికి తమ మద్దతును వారు ప్రకటించారు. ఢిల్లీలో ఉన్న నారా లోకేష్ ను ఈరోజు హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలాతో పాటు బీఎస్పీ పార్లమెంటు సభ్యులు డ్యానిష్ ఆలి, రితేష్ పాండేలు పరామర్శించారు.
Next Story