Mon Nov 18 2024 09:37:44 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ ప్రభుత్వంపై.. తెలంగాణ సీఎంను ఆశ్రయించిన దస్తగిరి
మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి
మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. తాజాగా తన ప్రాణాలకు ముప్పు ఏర్పడిందంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని ఆశ్రయించాడు. వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారినందుకు వైసీపీ బెదిరిస్తోందని.. ఏపీ ప్రభుత్వంతో తనకు ప్రాణహాని ఉందని అన్నాడు. భద్రత కల్పించాలని తెలంగాణ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో వివేకా హత్య కేసు విచారణ తెలంగాణ హైకోర్టులో జరుగుతూ ఉంది. వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన అనంతరం దస్తగిరి బెయిల్ పై బయటికి వచ్చాక, ఓ ప్రేమ జంట వ్యవహారంలో కిడ్నాప్, దాడి కేసుల్లో ఇరుక్కున్నాడు. దస్తగిరికి ఈ రెండు కేసుల్లో బెయిల్ లభించడంతో కడప జైలు నుంచి విడుదలయ్యాడు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసును విచారిస్తున్న హైదరాబాద్‌లోని సీబీఐ న్యాయస్థానం మరోసారి విచారణ జరిపింది. కేసు విచారణకు వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డి కోర్టు ఎదుట హాజరయ్యారు. ఆయనతో పాటు ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతర నిందితులు గంగిరెడ్డి, భాస్కర్‌రెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి, ఉదయ్ కుమార్, సునీల్ యాదవ్ కోర్టుకు హాజరయ్యారు. వాదనల అనంతరం కోర్టు మార్చి 12కు వాయిదా వేసింది. వివేకా హత్యకేసులో కడప ఎంపీ అయిన అవినాశ్‌రెడ్డి ఎనిమిదో నిందితుడిగా ఉన్నారు. ఇప్పటికే ఆయనను సీబీఐ పలుమార్లు విచారించింది.
Next Story